ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్యాస్ సిలిండర్​ నుంచి మంటలు.. ఫర్నిచర్ దగ్ధం - కృష్ణా జిల్లా వార్తలు

కృష్ణా జిల్లా నందిగామలోని ఓ ఫాస్ట్​ఫుడ్ సెంటర్​లో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగాయి. హోటల్ నిర్వాహాకులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కొంత ఫర్నిచర్ దగ్దమైంది.

gas leakage and furnisher burn at nandigama in krishna district
గ్యాస్ సిలిండర్​ నుంచి మంటలు.. ఫర్నిచర్ దగ్ధం

By

Published : Jan 27, 2021, 9:57 PM IST

కృష్ణా జిల్లా నందిగామ పట్టణలోని భారత్​ టాకీస్ సెంటర్​లో లక్ష్మీ త్రివేణి ఫాస్ట్ ఫుడ్ సెంటర్​లో అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్​లో నుంచి మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో కొంత ఫర్నిచర్ దగ్దమైంది. వెంటనే అప్రమత్తమైన ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలం వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ఫాస్ట్​ఫుడ్ సెంటర్​లో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు

ఎవరికీ ఏ విధమైన ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హోటళ్లలో వంట చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ల మాత్రం వాడవద్దని, అలాంటి సిలిండర్లు వాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.

ఇదీ చదవండి:గుర్తు తెలియని వాహనం ఢీకొని విద్యార్థిని మృతి

ABOUT THE AUTHOR

...view details