ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

POLICE SPECIAL CARE: గన్నవరం పోలీసుల ఔదార్యం.. వృద్ధులకు అండగా అన్నీ తామై - gannvaram latest news

గన్నవరం మండలంలో నివసిస్తున్న వృద్ధుల రక్షణకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. నిత్యం వారికి అందుబాటులో ఉండేలా బీట్ కానిస్టేబుళ్లను కేటాయించారు. విధిగా వారిని పలకరించి ధైర్యం చెప్పే విధంగా ఏర్పాట్లు చేశారు.

గన్నవరం పోలీసుల గొప్పదనం
గన్నవరం పోలీసుల గొప్పదనం

By

Published : Aug 3, 2021, 8:05 PM IST

ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుల వివరాలు సేకరించి వారి రక్షణకు గన్నవరం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కార్యక్రమంలో భాగంగా వృద్ధుల ఇళ్లను గన్నవరం సీఐ శివాజీ సందర్శించారు. గ్రామాల వారీగా ఒంటరి వృద్ధుల వివరాలు సేకరించి, ఇప్పటికే వాటిని సంబంధిత పగలు, రాత్రి బీట్ పుస్తకాలలో నమోదు చేశారు. బీట్ కానిస్టేబుళ్లు విధిగా వారిని పలకరించి ధైర్యం చెప్పేలా ఏర్పాట్లు చేశారు.

రాత్రి పూట బీట్ కానిస్టేబుళ్లు వృద్ధుల ఇళ్ల పరిసర ప్రాంతాలను పరిశీలించే విధంగా బీట్ వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించారు. ఇదే కాకుండా, గ్రామ వాలంటీర్లు, మహిళా పోలీసులు, దిశ కానిస్టేబుళ్లు కూడా వీరి ఇళ్లను సందర్శించి వారికి చేదోడు వాదోడుగా ఉండేలా చూడాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సమాచారం అందించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా 100, 122 నెంబర్ల వాడకంపై అవగాహన కల్పించారు. దీని ద్వారా వారికి వ్యవస్థ మీద నమ్మకం, భరోసా కల్పించినట్లవుతుందని సీఐ శివాజీ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details