ప్రార్థనా మందిరాలపై వరుస దాడుల నేపథ్యంలో కృష్ణా జిల్లా గన్నవరం సర్కిల్ పరిధిలోని గ్రామాల్లో హిందూ ఆలయాలు, చర్చిలు, మసీదులలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. సీఐ శివాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో గన్నవరం, ఆత్కూరు స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. గుర్తించిన అనుమానితులను స్థానిక స్టేషన్లకు తరలించారు.
గన్నవరంలోని ప్రార్థనా మందిరాల్లో పోలీసుల తనిఖీలు - గన్నవరం వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో...గన్నవరం పోలీసులు తమ పరిధిలోని ప్రార్థనా మందిరాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టి...అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రార్థనా మందిరాల్లో పోలీసుల తనిఖీలు