ఉప ఎన్నిక వస్తే గెలుపుపై ఎటువంటి అపనమ్మకం లేదని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. చినఅవుటపల్లి సంఘటన.. కుంటుంబ గొడవని రాజకీయం చేయాలని చూడటం దారుణమన్నారు. గన్నవరం నియోజకవర్గంలో గ్రూపులు ఉండటం సహజమని చెప్పారు.
గతంలో ఏడు గ్రూప్ లు ఉండేవని.. అప్పుడే అందరిని కలుపుకొని పోయోవాడినన్నారు. ఇప్పడూ అదేవిధంగా మెలుగుతానని చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం స్వాగతిస్తున్నామని, ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోమని వంశీ తెలిపారు.