తెదేపా హయాంలో తన నియోజకవర్గంలో పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు తనపై వస్తోన్న వార్తలు నిరాధారమైనవని తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. గన్నవరంలో మాట్లాడిన ఆయన... వైకాపా ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లో తెదేపా నేతలు, కార్యకర్తలపై ఎన్నో కేసులు పెడుతోందని విమర్శించారు. నిరుపేదలకు పంచిన పట్టాలు రెవెన్యూ శాఖ పర్యవేక్షణలోనే తయారయ్యాయనీ... అలాంటప్పుడు అవి నకిలీవి ఎలా అవుతాయని ప్రశ్నించారు. ఒకవేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే తహసీల్దారు, పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. దీనిపై న్యాయస్థానానికి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామనీ.. చిన్న చిన్న కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
వైకాపా తప్పుడు కేసులు పెడుతోంది: వల్లభనేని వంశీ
తాను తెదేపాను వీడే ప్రసక్తే లేదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తేల్చి చెప్పారు. వైకాపా ప్రభుత్వం పెడుతోన్న తప్పుడు కేసులకు భయపడనని స్పష్టం చేశారు.
వల్లభనేని వంశీ మీడియా సమావేశం