అంతర్జాతీయ విమానాశ్రయానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లవల్లిలో 1200 ఎకరాల్లో... మోడల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. ఒక సెక్టార్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం దాదాపు 700కు పైగా ప్లాట్లకు అవకాశం కల్పించింది. మరో సెక్టార్లో భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగానే దిగ్గజ సంస్థలైన అశోక్ లేల్యాండ్, మోహన్ స్పిన్‌టెక్స్ స్పిన్నింగ్ మిల్ కూడా ప్రారంభమయ్యాయి. జాతీయ రహదారుల సంస్థ ఇందులోనే లాజిస్టిక్ హబ్‌తో పాటు గోల్డ్ రిఫైనరీ ఇండస్ర్టీస్, వింటేజ్ ఇండియా వంటి దిగ్గజ సంస్థలు కూడా ఇక్కడ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాయి. సౌకర్యాల లేమి పారిశ్రామికవేత్తలను పునరాలోచనలో పడేశాయి. ఇదే సమయంలో... ఔట్ రేట్ సేల్ ప్రాతిపదికన ప్లాట్లను కేటాయించిన వివిధ అసోసియేషన్ల పరిధిలో అనేక సంస్థలపై... A.P.I.I.C వేటు వేసింది.
వెనుకంజవేసేలా చేసింది..
స్థలాలు పొంది గడువులోగా డబ్బు చెల్లించకపోవటం.. ఏపీఐఐసీతో ఒప్పందాలు చేసుకోకపోవటం వల్ల.. ఆయా సంస్థల కేటాయింపులను రద్దు చేశారు. రెండు దశల్లో దాదాపు 200కు పైగా సంస్థలపై చర్యలు తీసుకోవటం.. పారిశ్రామికవేత్తలనూ వెనుకంజ వేసేలా చేసింది.