ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గన్నవరం తెదేపా బాధ్యుడిగా బచ్చుల అర్జునుడు - బచ్చుల అర్జునుడు తాజా వార్తలు

కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం తెదేపా ఇంఛార్జిగా బచ్చుల అర్జునుడు నియమితులయ్యారు. ఆయనకు స్థానిక కేడర్​తో మంచి సంబంధాలు ఉన్న కారణంగా.. అధినేత చంద్రబాబు ఆయనకు అవకాశం ఇచ్చినట్టు నేతలు భావిస్తున్నారు.

gannavaram-assembly-constituency-tdp-incharge-bachhula-arjunudu
బచ్చుల అర్జునుడు

By

Published : Sep 27, 2020, 7:57 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌గా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడును అధినేత చంద్రబాబు నియమించినట్లు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావ్‌ తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన తెలుగుదేశం అభ్యర్ధి వల్లభనేని వంశీ మోహన్‌ ఇటీవల వైకాపాలో చేరారు.

నియోజకవర్గపరంగా తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్‌ ఉన్నందున ఈ స్థానానికి ఇంఛార్జ్‌ ఎవరనే దానిపై గత కొంత కాలంగా చర్చ నడుస్తూ వస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన బచ్చుల అర్జునుడు గన్నవరం నియోజకవర్గంలోని వివిధ మండలాల కేడర్‌తో సత్సంబంధాలు కలిగి ఉండడం, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినందున ఆయనకు అధినేత అవకాశం ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details