కంటికచర్లలో 50 కేజీల గంజాయి స్వాధీనం - seiz
కృష్ణాజిల్లా కంచికచర్లలో పోలీసులు 50 కేజీల గంజాయిని పట్టుకున్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్కు బొలెరో వాహనంలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.
ganja-seized-at-krishna-dist
యువత ప్రాణాలతో చెలగాటమాడే మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కంచికచర్ల పోలీసులు అడ్డుకట్ట వేశారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్గేట్ వద్ద ...వైజాగ్ నుంచి హైదరాబాద్ బొలెరో వాహనంలో అర్ధరాత్రి తరలిస్తున్న 50 కేజీల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ సుమారు లక్ష రూపాయల ఉంటుందని అంచనా! సురేంద్ర కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.