Ganja Gang Murdered Muslim Young Man in Vijayawada: గంజాయి, మద్యం మత్తు తలకెక్కిన రౌడీమూక ఓ పేద ముస్లిం యువకుడ్ని హతమార్చింది. తన స్నేహితులతో వివాదం వద్దు అని చెప్పినందుకు మత్తులో ఉన్న అసాంఘిక శక్తుల గుంపు రెచ్చిపోయింది. అతనిపై దాడి చేసి కత్తులతో పొడిచి హతమార్చారు. రౌడీమూకల దుశ్చర్యతో నగరశివార్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యువకుడి మృతితో కుటుంబ సభ్యుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. యువకుడి మృతదేహంతో తహశీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. హత్యకు ముందు పోలీసులు నిందితులను పట్టుకుని వదిలేశారని.. అప్పుడే పోలీసులు వారిని స్టేషనుకు తీసుకెళ్లుంటే హత్య జరిగి ఉండేదికాదని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.
Muslim Boy killed by Ganja Gang: గొడవలు ఎందుకని యువకుడు ప్రశ్నించడంతో పిచ్చెక్కిన గంజాయి మూక.. అతడిపై విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీసింది. కృష్ణా జిల్లా పెనమలూరు పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. యనమలకుదురు- తాడిగడప డొంకకరోడ్డుకు చెందిన షేక్ రఫీ బుధవారం సాయంత్రం మసీదు వద్దకు వెళ్తుండగా.. స్థానికుడైన నడకుదుటి నాగరాజుతో ఎల్లారెడ్డి, అనిల్, డాన్ బాషా అనే వ్యక్తులు గొడవ పడుతుండడం గమనించాడు. నాగరాజు పిలవడంతో రఫీ వారి వద్దకు వెళ్లి గొడవ వద్దు.. ఇక్కడి నుంచి వెళ్లిపోండని సూచించాడు. ఆగ్రహించిన ఆ ముగ్గురూ రఫీని బెదిరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత బాధితుడు మూడురోడ్ల కూడలిలో ఉన్న తన స్నేహితుల వద్దకు రాగా అదే సమయంలో ఎల్లారెడ్డి, అనిల్, డాన్ బాషా, అక్రమ్ అనే వ్యక్తి, మరో 20 మంది కలిసి రెండు ఆటోలు, ద్విచక్రవాహనాలతో అక్కడకు చేరుకొన్నారు. రఫీని కాళ్లతో తొక్కి, కత్తులతో పొడిచి, కర్రలతో కొట్టి పరారయ్యారు. రఫీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు.
Man Injured in Blade Attack: భార్యాభర్తల మధ్య గొడవలు.. బావపై బావమరిది బ్లేడ్లతో దాడి