కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన తనిఖీల్లో ఆరుగురు యువకుల నుంచి ఆరు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కాశీ విశ్వనాథ్ తెలిపారు. వారిని అరెస్ట్ చేశామన్నారు. ఆ యువకులకు గంజాయి సరఫరా చేసిన మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. గంజాయి సేవించి మోటర్ రేసింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టామన్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గంజాయి పట్టివేత.. ఆరుగురు అరెస్ట్ - కృష్ణా జిల్లా నేర వార్తలు
కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆరుగురు యువకుల నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు.
కంకిపాడులో గంజాయి పట్టివేత