ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

40 కేజీల గంజాయిని పట్టుకున్న నూజివీడు పోలీసులు - 40 కేజీల గంజాయిని పట్టుకున్న నూజివీడు పోలీసులు

విశాఖపట్నం నుంచి నూజివీడు మీదుగా విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న 40 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

krishna distrct
40 కేజీల గంజాయిని పట్టుకున్న నూజివీడు పోలీసులు

By

Published : Jun 26, 2020, 5:45 PM IST

కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి నూజివీడు మీదుగా విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న 40 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి... రెండు కార్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితులు పాటి శ్రీనివాసరావు, రాజు, సురేష్, మనోజ్​లుగా పోలీసులు గుర్తించారు.

పాటి శ్రీనివాసరావు ప్రధాన సూత్రధారిగా పేర్కొన్న పోలీసులు... నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్​కు తరలిస్తామని తెలిపారు.

ఇది చదవండిజులై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్​

ABOUT THE AUTHOR

...view details