ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలల్లో.. చదువు మారుతోంది!

''ప్రభుత్వ పాఠశాలలు... విద్యార్థులను పట్టించుకోవు. ఉపాధ్యాయులు సరిగా చదువు చెప్పరు''.... అన్న భావన ఉండేది. ఇప్పుడు కాలంతో పాటే పరిస్థితులూ మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులూ మెరుగయ్యాయి. ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేయడం... పదో తరగతి విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సత్ఫలితాలనిస్తోంది. వేసవి సెలవుల్లోనూ చిన్నారుల వికాసానికి ప్రాధాన్యత కల్పిస్తున్న ప్రభుత్వం... రాష్ట్రవ్యాప్తంగా నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ''జ్ఞానధార'' పేరుతో అవగాహన తరగతులు నిర్వహిస్తోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో.. చదువు మారుతోంది

By

Published : May 15, 2019, 10:03 AM IST

ప్రభుత్వ పాఠశాలల్లో.. చదువు మారుతోంది

రాష్ట్రవ్యాప్తంగా నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వారికోసం ప్రత్యేక ప్రణాళిక తయారుచేసి అన్ని నగరపాలక సంస్థల పాఠశాలల్లో జ్ఞానధార పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులను స్మార్ట్, స్పార్క్​గా విభజించి తరగతులు నిర్వహిస్తున్నారు.

స్మార్ట్ బ్యాచ్​లో... వెనుకబడిన విద్యార్థులుంటారు. వారు వేటిని కష్టంగా భావిస్తున్నారో గుర్తించి... తగిన విధంగా తరగతులు నిర్వహిస్తున్నారు. వారి సందేహాలను నివృత్తి చేస్తూ... మెరుగయ్యేలా, చురుకయ్యేలా ప్రోత్సహిస్తున్నారు. స్పార్క్ విభాగంలో... చదువులో రాణించే విద్యార్థులుంటారు. వీరిని ఇంకా ప్రోత్సహించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ తరగతులపై తల్లిదండ్రులూ సుముఖత వ్యక్తం చేస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

విద్యార్థులు కష్టంగా భావించే ఆంగ్లం, గణితం, హిందీ, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం... ఇలా 5 సబ్జెక్టులపై తరగతుల్లో అవగాహన పెంచుతున్నారు. ఆయా పాఠ్యాంశాల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను ఎంపిక చేసి విద్యార్థులకు బోధిస్తున్నారు.

కేవలం పాఠాలు చెప్పి వదిలేయకుండా.... ఆరోజు చెప్పిన పాఠాలు విద్యార్థులకు ఎంతవరకు అర్థమయ్యాయో తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మార్కుల ఆధారంగా విద్యార్థుల ప్రతిభ అంచనా వేస్తున్నారు. అందరూ విద్యలో మెరుగయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి...

ఈ యువ కెరటాలు... ప్రయోగ కుసుమాలు

ABOUT THE AUTHOR

...view details