ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో మరో నలుగురు అరెస్ట్ - విజయవాడ గ్యాంగ్ వార్ వార్తలు

విజయవాడ ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది గ్యాంగ్ వార్. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

gang war accused
gang war accused

By

Published : Jul 14, 2020, 10:43 PM IST

విజయవాడ నగరంలో సంచలనం రేపిన గ్యాంగ్ వార్ కేసులో మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత కుమార్ అనే రౌడీషీటర్ తో పాటు అజయ్, శంకర్, మస్తాన్ లను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో రెండు ముఠాలకు చెందిన 50 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పెనమలూరుకు చెందిన రౌడీషీటర్ అనంతకుమార్ పై 6 కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుండటంతో.. అతన్ని 6 నెలల పాటు నగర బహిష్కరణ విధించినట్లు పోలీసులు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details