ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యసనాల కోసం చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

వ్యసనాల కోసం చోరీలకు పాల్పడుతున్న ముఠాను నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3కిలోల గంజాయి, 104 గ్రాముల కరిగించిన బంగారం స్వాధీనం చేసుకున్నారు. తాగుడు, జూదం, గంజాయి వంటి వ్యసనాల కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

By

Published : Mar 2, 2021, 9:09 PM IST

gang of thieves arrested in krishna district
వ్యసనాల కోసం చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో మహిళల మెడలోని బంగారు గొలుసులను చోరీ చేస్తూ విలాసంగా జీవిస్తున్న ముఠాను కృష్ణా జిల్లాలోని నూజివీడులో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3కిలోల గంజాయి, 104 గ్రాముల కరిగించిన బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టుకు హాజరు పరిచారు.

సీఐ వెంకట నారాయణ ఆధ్వర్యంలో సీసీఎస్ ఎస్ఐ, ముసునూరు ఎస్ఐ, నూజివీడు టౌన్ ఎస్ఐ, రూరల్ ఎస్ఐలు 4 టీములుగా దర్యాప్తు ప్రారంభించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఏలూరుకు చెందిన కరణం సుధాకర్, మాడుగుల రాణి, పులిగంటి జగదీష్​లను నూజివీడు శ్రీనివాస సెంటర్​లో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఒంటరిగా ఉన్న మహిళలే ఈ ముఠా టార్గెట్​గా పేర్కొన్నారు. తాగుడు, జూదం, గంజాయి వ్యసనాలకు బానిసై విలాసవంతమైన జీవితానికి కావాల్సిన డబ్బు చోరీలతో సమకూర్చుకుంటున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు.

ఇదీ చదవండి:పాలకొల్లులో రక్తపుధార.. అద్దె అడిగినందుకు దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details