విజయవాడ కనకదుర్గ ఆలయంలో వినాయక చవితి ప్రత్యేక పూజలు జరిగాయి. కొవిడ్ నిబంధనలు అనుసరించి ఆలయ అధికారులు మాత్రమే ఇందులో పాల్గొన్నారు. కొండపైన ఘాట్ రోడ్డు వద్ద లక్ష్మీగణపతి విగ్రహం వద్ద పూజలు చేశారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ సమక్షంలో వేదపండితులు గణనాధుడికి పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని సంకల్పం చెప్పారు. వినాయకుడు విఘ్నాలను తొలగించి సకల అభీష్టాలను సిద్ధింపచేయాలని.. కరోనా కష్టం తొలగిపోయి అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ గణేషుని వేడుకున్నారు.
కనకదుర్గమ్మ ఆలయంలో వినాయక చవితి ప్రత్యేక పూజలు - కనకదుర్గ గుడిలో వినాయకుడికి పూజల వార్తలు
విజయవాడ కనకదుర్గ ఆలయంలో వినాయక చవితి ప్రత్యేక పూజలు జరిగాయి. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని వేద పండితులు గణేషుని ప్రార్థించారు.
కనకదుర్గమ్మ ఆలయంలో వినాయక చవితి ప్రత్యేక పూజలు