ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సోనియా, రాహుల్ పేర్ల చివర జిన్నా అని పెట్టుకోవాలి' - gandhi sankalpa yatra book launched at vijayawada news

విజయవాడలో గాంధీ సంకల్ప యాత్ర అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో భాజాపా నేతలు పాల్గొన్నారు.గాంధీ సంకల్పయాత్ర పేరుతో దేశ వ్యాప్తంగా యాత్ర చేపట్టినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

gandhi sankalpa yatra book launched at vijayawada
విజయవాడలో గాంధీ సంకల్ప యాత్ర అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో భాజాపా నేతలు

By

Published : Dec 16, 2019, 10:34 AM IST

విజయవాడలో గాంధీ సంకల్ప యాత్ర పేరుతో ముంద్రించిన పుస్తక ఆవిష్కరణ ఘనంగా జరిగింది. గాంధీ సంకల్పయాత్ర పేరుతో దేశ వ్యాప్తంగా యాత్ర చేపట్టినట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. యాత్రలోని ముఖ్య ఘట్టాలను పుస్తకంలో పొందుపరిచినట్లు భాజపా నేతలు వెల్లడించారు. జిల్లాలో వారీగా సంకల్పయాత్రలో ప్రముఖ పాత్ర పోషించిన యాత్ర ప్రముఖులను కన్నా చేతుల మీదుగా సత్కరించారు. భారతదేశాన్ని 70 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీ పేరు పెట్టుకుని ఆయన ఆశయాలను మాత్రం తుంగలో తొక్కారని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. సోనియా, రాహుల్ గాంధీ... వారి పేర్ల చివర జిన్నా అని పెట్టుకుంటే సముచితంగా ఉంటుందని జీవీఎల్ దుయ్యబట్టారు.

సోనియా, రాహుల్ గాంధీ...వారి పేర్ల చివర జిన్నా అని పెట్టుకోవాలి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details