ప్లాస్టిక్ విడనాడి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నూజివీడు సబ్ కలెక్టర్ నూజివీడులో పిలుపునిచ్చారు. ఓ ప్రైవేట్ సంస్థ ఉచితంగా అందించిన గుడ్డ సంచులను వినియోగదారులకు అందించారు. నూజివీడు సబ్ జైల్లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. క్షణికావేశంలో చేసిన తప్పిదాలకు జైలుకు రావటం జరిగి ఉండవచ్చునని... పరివర్తన చెంది జీవన విధానాన్ని మార్చుకొని పది మందికి ఆదర్శంగా నిలవాలని ఖైదీలకు 15వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి జస్టిస్ ఎ.భారతి సూచించారు. జాతిపితగా ఖ్యాతి పొందిన మహాత్మాగాంధీ ఎన్నో కష్టాలకు ఓర్చి, సామాన్య జీవితాన్ని గడపి ప్రపంచానికి ఆదర్శనీయుడుగా నిలిచారన్నారు.
కృష్ణాజిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు - krishna
కృష్ణా జిల్లాలోని పలుచోట్ల మహాత్ముని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాపూజీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ ర్యాలీలను నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని పలువురు సూచించారు.
కృష్ణా జిల్లాలో ఘనంగా మహాత్ముని జయంతి వేడుకలు... స్వచ్ఛ భారత్ ర్యాలీలు
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో మహాత్మాగాంధీ చిత్రాలతో కూడిన ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. జాతిపిత బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఆయన చేసిన పోరాటాలతో కూడిన ఫొటోలను విద్యార్థులు తిలకించారు. జాతిపిత అవలంబించిన సూక్తులు, విలువలను తప్పకుండా పాటిస్తే ఆయన కలలు కన్న స్వరాజ్యం మనతోనే సాధ్యమవుతుందని విద్యార్థులు, అధ్యాపకులు అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి-ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం...భావితరాలను కాపాడుదాం