కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరుణాళ్లలో జూద క్రీడలు జోరుగా సాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ వద్ద పలు రకాల జూద క్రీడలు నిర్వహిస్తున్నారు. పోలీసులు, దేవాలయ అధికారులకు తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు చెబుతున్నారు.
ఎగ్జిబిషన్ నిర్వాహకులు అధిక డబ్బుకు ఆశపడి జూద క్రీడలు నిర్వహిస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. గంటల వ్యవధిలోనే లక్షలాది రూపాయలు చేతులు మారుతున్న జూద క్రీడపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.