ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 6, 2021, 8:07 AM IST

Updated : Nov 6, 2021, 12:40 PM IST

ETV Bharat / state

బెజవాడ దుర్గమ్మ: నుదుట రూపాయి బిళ్లంత బొట్టు.. చేతులకు 2 లక్షల గాజులు..!

నుదుట రూపాయి కాసంత కుంకమ దిద్దుకొని.. ఆరు గజాల చీరకట్టి.. రెండు చేతులనిండా గాజులు వేసుకొన్న నిండు ముత్తైదువను చూస్తే.. మన సంప్రదాయమే నడిచివచ్చినట్టుగా ఉంటుంది! అలాంటిది.. తెలుగువారి ఇలవేల్పు, ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను చూడడానికి రెండు కళ్లూ సరిపోతాయా? గాజుల మహోత్సవాన.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన దుర్గమ్మను.. మట్టి గాజులతో అలంకరించిన తీరు ముచ్చటగొలుపుతోంది..

gajula-mahotsavam-in-vijayawada-kanakadurga-temple
ఇంద్రకీలాద్రిపై గాజుల అలంకరణ మహోత్సవం

ఇంద్రకీలాద్రిపై గాజుల అలంకరణ మహోత్సవం

ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గాజుల ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. అమ్మవారి మూలవిరాట్‌ను వివిధ రకాల మట్టి గాజులతో అలంకరించారు. అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ప్రాంగణాన్ని రంగురంగుల గాజులతో ముస్తాబు చేశారు. ఇంద్రకీలాద్రిపై 2016 నుంచి ప్రారంభించిన ఈ విశేష పూజ ఎంతో ప్రాచుర్యం పొందింది. సుమారు 2లక్షలకుపైగానే గాజుల దండలతో ఇంద్రకీలాద్రిని అలంకరించారు.

కార్తీక మాసంలో రెండో రోజున అమ్మవారికి భక్తులు గాజులు, పసుపు, కుంకుమను సమర్పిస్తారు. ఉత్సవం ముగిసిన తర్వాత అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. అమ్మవారి గాజుల అలంకరణ మహోత్సవాన్ని చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

Last Updated : Nov 6, 2021, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details