లాక్ డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని.. కృష్ణా జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ విమర్శిచారు. వెంటనే మద్యం షాపులు మూసివేయాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడలోని తన నివాసంలో 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఆమె దీక్షకు ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత, తెలుగు మహిళ నాయకులు సంఘీభావం తెలిపారు.
మద్యం దుకాణాలు మూసేయాలని 12 గంటల దీక్ష - మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా విజయవాడలో గద్దె అనురాధ దీక్ష
జే ట్యాక్స్ కోసం మద్యం దుకాణాలు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని కృష్ణా జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ ఆరోపించారు. వెంటనే మద్యం షాపులు మూసేయాలని డిమాండ్ చేస్తూ ఆమె విజయవాడలో 12 గంటల దీక్ష చేపట్టారు.
గద్దె అనురాధ 12 గంటల దీక్ష
ఒకవైపు కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం మద్యం దుకాణాలు తెరవడం అమానుషమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మద్యపాన నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జే టాక్స్ కోసమే వైన్ షాప్స్ తెరిచిందని కేశినేని శ్వేత ఆరోపించారు.
ఇవీ చదవండి.. 'సారా మాఫియాపై స్పీకరే చెప్పినా పట్టించుకోలేదు'