విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలికసదుపాయాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తూ పురపాలకశాఖ ఉత్తర్వులిచ్చింది. మొత్తం 50 కోట్ల రూపాయల మేర నిధుల్ని విడుదల చేసింది. ఈమేరకు పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ నగరంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకుగానూ ఈ నిధుల్ని వెచ్చించనున్నారు.
విజయవాడ పురపాలక అభివృద్ధికి రూ.50కోట్ల నిధులు విడుదల - విజయవాడ పురపాలక అభివృద్ధి
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం రూ.50కోట్ల నిధులను పురపాలకశాఖ విడుదల చేసింది. వాటితో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు.
విజయవాడ పురపాలక అభివృద్ధి నిధులు విడుదల