ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైరస్ సీజన్​లో పండ్లను తెగ తినేస్తున్నారట!

కరోనా వైరస్​ సీజన్​లో పండ్ల విక్రయాలు జోరందుకున్నాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలన్న ఆసక్తితో పళ్లను తినేందుకు ఇష్టపడుతున్నారు ప్రజలు. ఖర్చు ఎక్కువైనా పర్లేదు అనుకుంటూ ఆర్గానిక్ వాటినే కొనేందుకు మక్కువ చూపుతున్నారు. అయితే పండ్లు మితంగా తింటే మంచిదేకాని... ఆహారాన్ని పక్కనపెట్టి మరీ వాటికే ప్రాధాన్యం ఇస్తే లేనిపోని ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

fruits sales
పండ్లు

By

Published : Sep 18, 2020, 4:53 PM IST

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుంటంతో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. తాజా పండ్లు తినటం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని నిపుణులు సూచిస్తుండటంతో ఆ దిశగా పోతున్నారు. జోరుగా పండ్ల విక్రయాలు సాగిస్తున్నారు. సాధారణంగా వేసవి కాలంలో ఎండ తాపం నుంచి ఉపశమనం పొందేందుకు పళ్ల రసాలను ఎక్కువ తీసుకుంటారు. దీనివల్ల సాధారణ సీజన్లతో పోల్చితే వేసవిలో పండ్లకు గిరాకీ ఎక్కువ. అయితే కరోనా కారణంగా వేసవి తర్వాత కూడా పండ్ల కొనుగోళ్లు... సీజన్ తరహాలోనే ఉంటున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొంచెం ఖర్చు ఎక్కువైనా సేంద్రీయంగా దొరికే వాటిని కొనేందుకే ప్రజలు ఇష్టపడుతున్నారట.

అచ్చంగా పండ్లను మాత్రమే తినటం ద్వారా సర్వ రోగాలు నివారించుకోవటంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చనే అపోహతో కొందరు ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు చెప్తున్నారు. రోజూ తినే భోజనం, ఇతర ఆహారం మానేసి మరీ కొందరూ పూర్తి స్థాయిలో పండ్లను తినటం వల్ల ఇతరత్రా ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అలాగే పసుపు, అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క తదితర మిశ్రమాలతో కూడిన కషాయం కూడా మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే కానీ అమితంగా తీసుకుంటే మాత్రం నష్టం తప్పదని తేల్చి చెప్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details