ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MANGO FARMERS: మామిడి రైతులకి శాపంగా మారిన.. ఆ పీడ! - krishna district latest news

MANGO FARMERS: పండ్లలో రారాజైన మామిడిని పండించడంలో మన రాష్ట్రం ముందు వరసలో ఉంటుంది. కానీ కొన్నేళ్లుగా మామిడి రైతులకు పండుఈగ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా మామిడి సాగుచేస్తున్న రైతులు..పండుఈగ చేస్తున్న నష్టానికి కోలుకోలేకపోతున్నారు. ఇన్నేళ్లుగా అన్నం పెట్టిన మామిడి చెట్లనే గత్యంతరం నరికివేస్తున్నారు.

మామిడి రైతులకి శాపంగా మారిన పండుఈగ
మామిడి రైతులకి శాపంగా మారిన పండుఈగ

By

Published : Dec 23, 2021, 6:41 PM IST

మామిడి రైతులకి శాపంగా మారిన పండుఈగ

MANGO FARMERS: కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలోని ఎడ్లంక, బందలాయిచెరువు, వెకనూరు గ్రామాల్లోని లంక భూముల్లో వేలాది ఎకరాల్లో మామిడి తోటలు సాగుచేస్తున్నారు. ఈ ప్రాంతంలో అన్ని రకాల మామిడి పండ్లనూ పండిచడం.. అవి చాలా రుచిగా ఉండటంతో.. జనం చాలా ప్రాంతాల నుంచి వచ్చి మామిడి కాయలు కొనుగోలు చేస్తారు. విదేశాలకు సైతం ఇక్కడి మామిడి ఎగుమతి అవుతూ ఉంటుంది. ముఖ్యంగా బంగినపల్లి మామిడికి అవనిగడ్డ లంక తోటలు ప్రసిద్ధి పొందాయి.

అయితే.. గత నాలుగేళ్లుగా పండుఈగ మామిడి రైతులకు శాపంగా మారింది. పండు ఈగ.. మామిడి కాయపై వాలి చిన్నచిన్న రంద్రాలు చేయడంతో.. కాయపై మచ్చ ఏర్పడి రాలిపోతుంది. అంతేకాకుండా.. పైన చూడడానికి బాగానే ఉన్నా.. లోపల మాత్రం తెల్ల పురుగులు చేరుతున్నాయి. ఎన్ని మందులు కొట్టినా.. లాభంలేకపోవడంతో మామిడి తోటలను నరికివేస్తున్నారు రైతులు. లక్షలు అప్పుచేసి సాగుచేస్తే.. పెట్టుబడి కూడా రాకపోవడంతో అప్పులు పెరిగిపోతున్నాయని వాపోతున్నారు.

పండుఈగ వల్ల మామిడికాయల్లో పురుగులు చేరుతుండటంతో.. దళారులు కొనడం లేదని రైతులు చెబుతున్నారు. ఎన్ని మందులు వాడినప్పటికీ.. ఈ పండుఈగని నివారించలేకపోతున్నామని అంటున్నారు. ఇప్పటికే దివిసీమలో వందల ఎకరాల్లో మామిడి తోటను నరికేశారని.. ఉన్న కాస్తోకూస్తో తోటలు సైతం రాబోయే రోజులలో ఉండవని అంటున్నారు.

ఇప్పటికైనా ఉద్యాన శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలు పండుఈగ నివారణపై శ్రద్ధ చూపాలని రైతులు కోరుతున్నారు. ఈ సమస్య బారి నుంచి మామిడి తోటలను రక్షించాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

కన్నబిడ్డ కోసం క్రూరమృగంపై ఒంటరిగా పోరాడి, గెలిచిన తల్లి

ABOUT THE AUTHOR

...view details