కృష్ణా జిల్లా మైలవరం ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న ఫ్రెండ్లీ పోలీస్ ప్రతిభ జాబ్ మేళాను గురువారం నిర్వహించారు. స్థానిక సీఎంఆర్ కళ్యాణ మండపంలోని పీవీఎన్ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో మైలవరం సర్కిల్ పోలీస్ వారు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో 24 కంపెనీల హెచ్ఆర్ ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేశారు. మైలవరం సర్కిల్ పరిధిలోని మైలవరం ,జి. కొండూరు, ఏ.కొండూరు,రెడ్డిగూడెం మండలాల నుంచి నిరుద్యోగ యువత ఇందులో హాజరయ్యారు. ఇందులో 520 మంది వివిధ కంపెనీలకు సెలెక్ట్ అయ్యి.. ఆయా కంపెనీల నియామకపత్రాలను అందుకున్నారు.
ఫ్రెండ్లీ పోలీస్ ప్రతిభ జాబ్ మేళాలో 520 మందికి ఉద్యోగాలు - మైలవరంలో ఫ్రెండ్లీ పోలీస్ జాబ్ మేళా వార్తలు
ఫ్రెండ్లీ పోలీస్ ప్రతిభ జాబ్ మేళాను కృష్ణా జిల్లా మైలవరం సర్కిల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. పీవీఎన్ఆర్ గ్రూప్స్ దీనిని ఏర్పాటుచేస్తోంది. ఈ జాబ్ మేళాలో 520 మంది వివిధ కంపెనీలకు ఎన్నికయ్యారు. ఉద్యోగాలు సంపాదించిన వారికి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అభినందనలు తెలిపారు.

స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుల చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్స్ అందుకున్నారు. ఉద్యోగాలు సంపాదించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. నిజాయితీ, కష్టపడేతత్వం, మరింత ఉన్నత శిఖరాలు చేరేలా చేస్తుందని సూచించారు. జిల్లావ్యాప్తంగా ఈ జాబ్ మేళా నిర్వహించేలా ప్రయత్నం చేస్తున్నామన్న ఎస్పీ.. దీనికి సహకరిస్తున్న పీవీఎన్ఆర్ గ్రూప్‌కి, పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి:ఉద్ధండరాయునిపాలెంలో పోటాపోటీ ఆందోళనలు..భారీగా పోలీసుల మోహరింపు