స్వాతంత్య్ర సమరయోధుడు బండారు భోగేశ్వర వరప్రసాద రావు వయోభారంతో గత రాత్రి విజయవాడలో కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన నందిగామకు ఈరోజు తీసుకొచ్చారు. ఈయన క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు అయ్యదేవర కాళేశ్వరరావు, కాకాని వెంకటరత్నం, ఆచార్య ఎన్జీరంగాల అడుగుజాడల్లోనే ఆయన స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుడు బండారు భోగేశ్వరరావు కన్నుమూత - ap latest news
స్వాతంత్య్ర సమరయోధుడు బండారు భోగేశ్వర వరప్రసాద రావు గతరాత్రి విజయవాడలో మృతి చెందారు. వయోభారంతో ఆయన కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన నందిగామకు ఈరోజు తీసుకువచ్చారు.
స్వాతంత్య్ర సమరయోధుడు బండారు భోగేశ్వర రావు మృతి
బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో నందిగామలోని హైస్కూల్ తగలబెట్టిన కేసులో భోగేశ్వర రావు జైలు శిక్ష అనుభవించారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తులు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతదేహాన్ని స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చూడండి:Permanent transfer: ఏపీకి శాశ్వత బదిలీ... తెలంగాణ సర్కారు అనుమతి