బుడిపాటి వెంకట్రావు అంటే కృష్ణా జిల్లా మైలవరం పరిసర గ్రామాల్లో తెలియని వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి కాదు. పవర్ లిఫ్టింగ్‌లో నిరుపేద యువకులకు ఉచితంగా శిక్షణ ఇస్తూ అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తున్నారీయన.
పవర్ లిఫ్టింగ్‌లో ఉచిత శిక్షణ... నిరుపేదలకు ఆయన వరం... - మైలవరం ఉచిత పవర్ లిఫ్టింగ్ శిక్షణ
పవర్ లిఫ్టింగ్‌లో యువకులకు ఉచితంగా శిక్షణనిస్తున్నారాయన... పేదరికంలో ఉన్నవారికి ఆయనో వరం... నిరుపేద యువకులకు శిక్షణ ఇస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తున్నారు. ఆయనే కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన బుడిపాటి వెంకట్రావు.
పవర్ లిఫ్టింగ్‌లో యువతకు వెంకట్రావు ఇచ్చే శిక్షణ వినూత్న రీతిలో ఉంటుంది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని గురువుకు, తమ ప్రాంతానికి గుర్తింపు తీసుకొస్తున్నారు యువకులు. వెంకట్రావు వద్ద శిక్షణ పొందిన పలువురు యువకులు పోలీస్, రైల్వే శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం పవర్ లిఫ్టింగ్‌పై ఉన్న మక్కువతోనే అర్హులైన వారికి శిక్షణ ఇస్తున్నట్లు వెంకట్రావు వివరించారు. తమ ప్రాంతానికి పవర్ లిఫ్టింగ్‌లో గుర్తింపు తీసుకొస్తున్న వెంకట్రావును గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి:మైలవరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆటల పోటీలు