కృష్ణాజిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాల కోసం అభ్యర్థులు, వారికి మద్దతిచ్చిన పార్టీలు వేచి చూస్తుండగా.. ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.
- ఉంగుటూరు మండలం నాగవరప్పాడు సర్పంచిగా నాగూర్ విజయం సాధించారు.
- నందమూరిలో 253 ఓట్ల మెజార్టీతో తులిమిల్లి బేబీ గెలుపొందారు.
- గన్నవరం మండలం బూతిమిల్లిపాడులో 4 ఓట్ల తేడాతో పేరం సుబ్బారావు సర్పంచిగా గెలిచారు.
- సావారిగూడెంలో ప్రత్యర్థి పసుమర్తి గణేష్పై అట్ల నాగేశ్వరరావు.. 270 ఓట్ల మెజారిటీతో సర్పంచిగా గెలుపొందారు.