ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒకే కుటుంబంలో నలుగురు మృతి - కృష్ణా జిల్లాలో కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

కరోనా ఓ న్యాయవాది కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబంలో నలుగురి మృతి చెందిన ఘటన విజయవాడ 1వ పట్టణంలో చోటుచేసుకుంది. రెండు రోజుల్లో తల్లీతండ్రీ, కుమారుడు, చిన్నాన్న మృతి స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

four persons died due to covid
ఒకే కుటుంబంలో నలుగురి మృతి

By

Published : Apr 21, 2021, 8:10 AM IST

కృష్ణా జిల్లా విజయవాడ 1వ పట్టణ పరిధిలో ఓ న్యాయవాది కుటుంబాని కరోనా కబళించింది. ఆ కుటుంబంలో నలుగురు మృతిచెందిన హృదయ విదారకంగా ఘటన చోటు చేసుకుంది. తూనుకుంట్ల దుర్గాప్రసాద్‌(67), తూనుకుంట్ల కృష్ణ(64) సోదరులు. సమ్మెటవారి వీధిలో పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. దుర్గాప్రసాద్‌ మెడికల్‌, ఫ్యాన్సీ దుకాణం నిర్వహిస్తుండగా... కృష్ణ వస్త్ర వ్యాపారం చేస్తుంటారు. పది రోజుల క్రితం దుర్గాప్రసాద్‌ భార్య పద్మావతి (63)కి కరోనా సోకగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. తర్వాత కృష్ణకూ వైరస్‌ సోకింది. మరో రెండు రోజులకు దుర్గాప్రసాద్‌ కూడా కరోనాతో ఆసుపత్రిలో చేరారు.

ఈ ముగ్గురికీ చికిత్స అందిస్తుండగా ఆదివారం అర్ధరాత్రి గంట వ్యవధిలో పద్మావతి, కృష్ణ చనిపోయారు. వారి మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించాక దుర్గాప్రసాద్‌ కుమారుడు న్యాయవాది అయిన దినేష్‌(37)కు వైరస్‌ సోకినట్లు తేలింది. ఆయనా అదే ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఉదయం దుర్గాప్రసాద్‌ కన్నుమూశారు. దీంతో ఆసుపత్రిలో వైద్యం సరిగా అందడం లేదని దినేష్‌ను బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన మధ్యాహ్న సమయంలో చనిపోయారు. దినేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు.. కృష్ణకు భార్య, కుమారుడు ఉన్నారు. ఈ రెండు కుటుంబాలకు చెందిన వారంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details