ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా జిల్లాలోని మున్నేరు నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. పెనుగంచిప్రోలు మండలంలోని శనగపాడు గ్రామానికి చెందిన నలుగురు పశువుల కాపరులు... పశువులను మేపడానికి వెళ్లి నదిలో చిక్కుకున్నారు.
విషయం తెలుసుకున్న గ్రామస్థులు... వారిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా... వారి కోసం ఎదురు చూస్తున్నారు.