ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందిగామ ప్రభుత్వాసుపత్రిలో.. కరోనా బాధితులు నలుగురు మృతి - nandigama corona news

కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వాసుపత్రిలో నలుగురు కరోనా బాధితులు మృతి చెందారు. ఆసుపత్రిలో చేరే సమయానికే వారిలో ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువగా ఉందని.. చికిత్స చేస్తున్న సమయంలో వారు మృతి చెందారని ఆసుపత్రి సూపరింటెండెంట్ కమల తెలిపారు.

nandigama government hospital
నందిగామ ప్రభుత్వాసుపత్రిలో నలుగురు కరోనా బాధితులు మృతి

By

Published : May 4, 2021, 3:16 PM IST

కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వ వైద్యశాలలో ఆక్సిజన్‌తో కరోనా చికిత్స పొందుతున్న నలుగురు మృతి చెందారు. పెద్దవరం, కొండపల్లి, చింతలపాడు గ్రామాలకు చెందిన వీరు... తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రికి రాగా... పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. అప్పటికే వారిలో ఆక్సిజన్‌ స్థాయి చాలా తక్కువగా ఉందని... ఆసుపత్రి సూపరింటెండెంట్ కమల తెలిపారు.

చికిత్స అందిస్తుండగా మరణించినట్టు వివరించారు. చనిపోయిన నలుగురిలో ఒకరి మృతదేహాన్ని బంధువులు తీసుకెళ్లగా... మిగిలిన మృతుల కుటుంబసభ్యులు మందుకురాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో... మృతదేహాల ఖనన బాధ్యతను తీసుకున్న నందిగామ నగర పంచాయతీ... అందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు.

ABOUT THE AUTHOR

...view details