ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణాజిల్లాలో 3.8 కిలోల లిక్విడ్ గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్ - పొట్టపాడు టోల్ గేట్ వద్ద పోలీసుల తనిఖీలు

Four ganja thieves arrested in krishna Distric: విశాఖ ఏజెన్సీ నుండి ఆర్టీసీ బస్సులో 18 కేజీల గంజాయి, 3.800కేజీల లిక్విడ్ గంజాయిని తరలిస్తున్న గ్యాంగ్​ పట్టుబడింది. హనుమాన్ జంక్షన్ పొట్టపాడు టోల్ గేట్ వద్ద నలుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టి కేసు పూర్వాపరాలు తెలిపారు.

sp josuva
3.800కేజీల లిక్విడ్ గంజాయి పట్టివేత

By

Published : Dec 28, 2022, 9:31 PM IST

Four Ganja Thieves Arrest: విశాఖపట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, బెంగళూరుకు చెందిన మరో వ్యక్తి.. ఓ ముఠాగా ఏర్పడి, గంజాయిని లిక్విడ్‌గా మార్చి బెంగళూరు పరిసర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు కృష్ణా జిల్లా ఎస్పీ పి. జాషువా తెలిపారు. లిక్విడ్ గంజాయి బ్యాచ్‌ని మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు పూర్వాపరాలను వెల్లడించారు.

విశాఖ ఏజెన్సీ నుంచి ఆర్టీసీ బస్సులో 18 కేజీల గంజాయి, 3.800కేజీల లిక్విడ్ గంజాయిని తరలిస్తుండగా హనుమాన్ జంక్షన్ పొట్టపాడు టోల్ గేట్ వద్ద నలుగురు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారన్నారు. గతంలో కూడా వీరు.. గంజాయిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారని, నిందితులపై ఇప్పటికే ఎన్‌డీపీఎస్​ కేసులు, రౌడీషీట్‌లు తెరిచి ఉన్నాయని పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో విశేష కృషి చేసిన హనుమాన్ జంక్షన్ సీఐ నవీన్ నరసింహమూర్తి, ఆత్కూరు ఎస్ఐ, మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌కు ఎస్పీ జాషువా రివార్డులను అందజేశారు.

కృష్ణా జిల్లాలో 3.800కేజీల లిక్విడ్ గంజాయి పట్టివేత..నలుగురు అరెస్ట్

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details