కృష్ణా జిల్లా గన్నవరం మండలం బీబీగూడెంలో జాతీయ రహదారి నిర్వాసిత రైతులు ఆందోళన చేపట్టారు. గొల్లపూడి - చిన్నఅవుటపల్లి జాతీయ రహదారి అభివృద్ధిలో భాగంగా గన్నవరం మండలం బాహుబలేంద్రగూడెంలో సుమారు 24 మంది రైతుల నుంచి 40 ఎకరాల భూమిని 2015లో అప్పటి ప్రభుత్వం తీసుకుంది. రూ.38 లక్షల చొప్పున ఇస్తామన్న పరిహారం రూ.22 లక్షలనే చెల్లించారు.
బీబీగూడెంలో రైతుల ఆందోళన
కృష్ణాజిల్లా గన్నవరం మండలం బీబీగూడెంలో జాతీయ రహదారి నిర్వాసిత రైతులు ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన పూర్తిస్థాయి నష్టపరిహారాన్ని చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
బీబీగూడెంలో రైతుల ఆందోళన
మిగిలిన పరిహారాన్ని ఆర్బీటేషన్ పేరుతో చెల్లిస్తామని నేటికీ చెల్లించలేదు. కోర్డు ఆదేశాలతో గత జేసీ బాబూరావు పరిహారం చెల్లింపునకు అదేశాలిచ్చినా నేటికీ నష్టపరిహారం విడుదల కాకపోవడంపై స్థానిక రైతులు ఆందోళన చేపట్టారు. తప్పుల తడకగా ఉన్న భూరికార్డులు సరిచేసి.. పరిహారం చెల్లించే వరకు తమ భూముల్లో రోడ్లు వేయకూడదని రైతులు స్పష్టం చేశారు
ఇదీ చదవండి