కృష్ణాజిల్లా జి.కొండూరు మండలంలోని వెలగలేరు గ్రామంలో మార్కెట్ యార్డు ఆధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు. నెల రోజులుగా తమ కల్లాల్లో ధాన్యం రాశులు పోసి ఉన్నా.. కొనే దిక్కు లేదని వాపోయారు. 1010 రకం ధాన్యం వేస్తే అధికారులు బెదిరించి తమతో బలవంతంగా 1121 రకం ధాన్యాన్ని సాగు చేయించారన్నారు. మద్దతు ధరకు కొంటామన్న అధికారులు..తీరా పంట చేతికి వచ్చాక దళారులతో కుమ్మక్కై...తక్కువ ధరకు వారికి కట్టబెట్టడానికి చూస్తున్నారని ఆరోపించారు.
మార్కెట్ యార్డు అధికారుల తీరుపై రైతుల ఆందోళన - కృష్ణాజిల్లా తాజా వార్తలు
కృష్ణాజిల్లా జి.కొండూరు మండలంలోని వెలగలేరు గ్రామంలో మార్కెట్ యార్డు ఆధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు. నెల రోజులుగా తమ కల్లాల్లో ధాన్యం రాశులు పోసి ఉన్నా.. కొనే దిక్కు లేదని వాపోయారు.
మార్కెట్ యార్డు అధికారుల తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన రైతులు
మార్కెట్ యార్డులకు తీసుకువెళితే ధాన్యం విరిగిందని, తరుగు కింద పది కిలోలు తగ్గిస్తామని మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
జూన్ 1 నుంచి.. తిరుమల - అలిపిరి నడక మార్గం మూసివేత!