ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇసుక తవ్వకాలు ఆపాలని రైతుల నిరసన' - formers agitation for sand digging in krishna

పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను నిలుపుదల చేయాలంటూ రైతులు టెంట్ వేసి నిరసన తెలిపిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.

ఇసుక తవ్వకాలు ఆపాలని రైతుల నిరసన

By

Published : Nov 5, 2019, 1:59 PM IST

ఇసుక తవ్వకాలు ఆపాలని రైతుల నిరసన
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడు పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు ఆపాలంటూ రైతులు నిరసన తెలిపారు. రెండు అడుగుల మేరకు అనుమతి తీసుకొని సుమారు పది అడుగుల వరకూ ఇసుక తవ్వుతున్నారని ఆరోపించారు. ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవటంతో పంటలు నష్ట పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తవ్వకాలు నిలిపేసి.. న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details