2024 ఎన్నికల్లో(elections) రాష్ట్రానికి సీఎం అయ్యే వ్యక్తి కాపు వ్యక్తేనని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ (Former Union Minister Chinta Mohan)జోస్యం చెప్పారు. ఆ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడేనన్నారు. ఈ మేరకు మచిలీపట్నం వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. ఏపీలో అధికారం ఆ రెండు సామాజిక వర్గాల సొంతం కాదన్నారు.
Chinta Mohan: 2024లో ఆ వర్గానికి చెందిన వ్యక్తే సీఎం..చింతా మోహన్ జోస్యం - ఏపీ వార్తలు
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రానికి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే సీఎం అవుతాడని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్(Former Union Minister Chinta Mohan) జోస్యం చెప్పారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం(ycp govt) రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు.
![Chinta Mohan: 2024లో ఆ వర్గానికి చెందిన వ్యక్తే సీఎం..చింతా మోహన్ జోస్యం Chinta Mohan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13594016-18-13594016-1636538552171.jpg)
రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం నుంచి కామరాజ్ నాడార్(Kamaraj Nadar) లాంటి వ్యక్తుల కోసం కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తోందని చింతా మోహన్(Chinta Mohan) తెలిపారు. వైకాపా ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ నిధులను ఆపే శక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి