పత్తి రైతుల కోసం ప్రభుత్వం వెంటనే సీసీఐ కొనుగోలు కేంద్రాలు తిరిగి తెరవాలని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు. పశ్చిమ కృష్ణాలో సకాలంలో అమ్ముకోలేక మిగిలిపోయిన పత్తి దాదాపుగా 60 వేల క్వింటాళ్ల వరకు ఉందన్నారు. రైతులు సకాలంలో ఈ క్రాప్ బుకింగ్ చేసుకోలేకపోవడం, ఇతర కారణాల వల్ల పంటను అమ్ముకోలేక పోయారని..., ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయట మార్కెట్లో క్వింటాలు పత్తి ధర రూ.4000 మించి రావడం లేదని... ఫలితంగా క్వింటాలకు 1000 రూపాయలపైగా రైతులు నష్టపోతున్నారని ఆమె తెలిపారు.
తక్షణమే సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరవండి: తంగిరాల సౌమ్య - విజయవాడ వార్తలు
బహిరంగ మార్కెట్లో ధర పడిపోయిన కారణంగా, సకాలంలో పంటను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య