ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అధికారుల నిర్లక్ష్యం వల్లే కౌలు రైతు ఆత్మహత్య'

వైకాపా సర్కార్​ రైతులను ఇబ్బంది పెడుతోందని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శించారు. రోజులు తరబడి తిరిగినా అధికారులు పత్తిని కొనుగోలు చేయకపోవటం వల్లే కృష్ణా జిల్లా చందర్లపాడుకు చెందిన కౌలు రైతు కట్టా లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఆ రైతుకు చెందిన పత్తి బొరలను నందిగామ మార్కెట్ యార్డులో ఆమె పరిశీలించారు.

former mla tangirala  sowmya
'అధికారుల నిర్లక్ష్యం వల్లే చందర్లపాడు కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు'

By

Published : Jan 21, 2021, 4:19 PM IST

కృష్ణా జిల్లా చందర్లపాడు గ్రామంలో మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న కట్టా లక్ష్మీనారాయణకు చెందిన పత్తి బొరలను నందిగామ మార్కెట్ యార్డులో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. అనంతరం మార్కెట్ శాఖ అధికారులతో మాట్లాడారు. యార్డులో అధికారుల నిర్లక్ష్యంపై తెదేపా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే కౌలు రైతు లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ రైతు రోజుల తరబడి తిరిగినా కూడా యార్డులో అధికారులు పత్తి కొనుగోలు చేయలేదు. అందువల్లనే ఆ కర్షకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి అధికారులు, పాలకులు బాధ్యత వహించాలి. సీసీఐ బయ్యర్ పత్తిని సక్రమంగా కొనుగోలు చేయటం లేదని... ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు, పాలకులు పట్టించుకోలేదు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూనే కర్షకులను ఇబ్బంది పెడుతున్నారు అధికార పార్టీ నేతలు- తంగిరాల సౌమ్య, మాజీ ఎమ్మెల్యే

ఇదీ చదవండి

కౌలు రైతు కుటుంబానికి సబ్ కలెక్టర్ పరామర్శ

ABOUT THE AUTHOR

...view details