ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పరిటాల గ్రామస్థులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి' - కంచికచర్ల వార్తలు

పరిటాల గ్రామస్థులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు. లబ్ధిదారుల కోసం సేకరించిన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. స్థానిక తహసీల్దార్​ను కలిసి వినతి పత్రం అందజేశారు.

former MLA Tangirala soumya  protest
ఇళ్ల స్థలాలు కేటాయించాలి

By

Published : Dec 21, 2020, 4:10 PM IST

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల లబ్ధిదారుల కోసం సేకరించిన ప్రభుత్వ భూమిని... భూ బదలాయింపులో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆరోపించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. పరిటాల గ్రామస్థులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details