కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో.. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కు చెందిన ఓ వెంచర్.. అనధికారికంగా వేశారంటూ సీఆర్డీఏ అధికారులు అభ్యంతరం చెప్పారు. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బోడె ప్రసాద్.. గతంలో తక్కువ ధరకే భూమిని కొని.. తక్కువ ధరకే పేదలకు అమ్మినట్టు చెప్పారు. ఈ వెంచర్ అనధికారికం కాదని చెప్పడమే కాక.. రిజిస్ట్రేషన్ పత్రాలనూ చూపించారు. కక్ష పూరితంగానే తన వెంచర్ పైకి అధికారులను పంపించారని ఆరోపించారు.
బోడె ప్రసాద్ వెంచర్‌పై వివాదం - crda
మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు చెందిన వెంచర్.. అనధికారమంటూ సీఆర్డీఏ అధికారులు ఆరోపించారు. గతంలో లేని వివాదాన్ని.. ఇప్పుడు ఎందుకు సృష్టిస్తున్నారంటూ ప్రసాద్.. ఆగ్రహం వ్యక్తం చేశారు.
![బోడె ప్రసాద్ వెంచర్‌పై వివాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4064622-419-4064622-1565152165932.jpg)
వెంచర్‌ను ధ్వంసం చేస్తున్న సీఆర్డీయే అధికారులు