ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మద్యం అమ్ముతూ... పేదల రక్తాన్ని పీల్చుకుంటున్నారు' - visakhapatnam lg polymers factory latest news in telugu

లాక్​డౌన్​ విధించటంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని... మాజీఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. ఇటువంటి సమయంలో పేదలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం... మద్యం అమ్ముతూ... వారి రక్తాన్ని పీల్చుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖలో ఎల్​జీ పాలిమర్స్​ పరిశ్రమ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రెస్​మీట్​
పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రెస్​మీట్​

By

Published : May 7, 2020, 3:53 PM IST

కృష్ణా జిల్లా కంకిపాడులో తెదేపా మండల పార్టీ కార్యాలయంలో మాజీఎమ్మెల్యే బోడె ప్రసాద్​ సమావేశం నిర్వహించారు. ఓవైపు పేదలు ఆకలితో అలమటిస్తుంటే అన్న క్యాంటీన్​లు తెరవాల్సింది పోయి మద్యం దుకాణాలు తెరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో పేదలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మద్యం విడుదల చేసి వారి రక్తాన్ని పీల్చుకుంటున్నారంటూ మండిపడ్డారు. నిరుపేదలకు ప్రభుత్వం కేటాయిస్తున్న రూ.1000ని రూ. 5000 చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

విశాఖపట్నంలోని గోపాలపట్నం పరిధిలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:అలా అమ్మకాలు జరిగితే... రూ.30 వేల కోట్ల ఆదాయం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details