ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింగిల్ జడ్జి ముందుకు వైఎస్​ వివేకా హత్య కేసు వ్యాజ్యాలు - former minister ys vivekananda reddy murder case latest news in telugu

మాజీ మంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ... మృతుని భార్య వైఎస్ సౌభాగ్యమ్మ, అప్పటి ప్రతిపక్షనేత, నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతేడాది మార్చిలో హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సింగిల్‌ జడ్జి విచారణ జరపాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

former minister ys vivekananda reddy murder case latest issue
సింగిల్ జడ్డి ముందుకు మాజీ మంత్రి వివేకా హత్య వ్యాజ్యాలు

By

Published : Jan 8, 2020, 7:45 AM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థకు గానీ... సీబీఐకి గానీ అప్పగించాలని మృతుడి భార్య సౌభాగ్యమ్మ, అప్పటి ప్రతిపక్షనేత, నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాలపై సింగిల్‌ జడ్జి విచారణ జరపాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇదే అంశంపై ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలనూ.. వాటితో కలపి విచారించాలని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ వెంకరమణతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details