ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరి ఘటన (Lakhimpur Kheri incident) చాలా దురదృష్టకరమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది మంది మరణానికి దారి తీసిన ఘటనకు కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రైతులకు నష్టం కలిగించే ఈ చట్టాలను దేశమంతా వ్యతిరేకిస్తున్నా... కేంద్రం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఆ చట్టాలను రద్దు చేసి... రైతులు కోరుతున్న విధంగా కొత్త చట్టాలు తేవాలని కోరారు. స్వాతంత్ర్య పోరాటం తరహాలో ఈ దేశంలోని రైతులు పోరాడాల్సి రావడం బాధాకరమని సోమిరెడ్డి అన్నారు.
EX MINISTER SOMIREDDY: 'లఖింపుర్ ఖేరి ఘటన దురదృష్ణకరం.. ఇప్పటికైనా కొత్త చట్టాలు తీసుకురండి' - ap latest news
యూపీలోని లఖింపుర్ ఖేరిలో ఎనిమిది మంది మరణానికి దారి తీసిన ఘటనకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ అన్నారు. అంత మంది రైతులు చనిపోవడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
'లఖింపుర్ ఖేరి ఘటన దురదృష్ణకరం.. ఇప్పటికైనా కొత్త చట్టాలు తీసుకురండి'
Last Updated : Oct 5, 2021, 12:11 PM IST
TAGGED:
ఏపీ తాజా వార్తలు