బెంగళూరు, చెన్నై నుంచి కాలినడకన వెళ్తున్న ఒడిశా, జార్ఖండ్, బిహార్, బెంగాల్ రాష్ట్రాల వారితో పాటు శ్రీకాకుళం జిల్లా వాసులకు... నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, తెదేపా నేత పట్టాభిరామిరెడ్డిల ఆధ్వర్యంలో... మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భోజన సౌకర్యం కల్పించారు. వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సోమిరెడ్డి మండిపడ్డారు. రోడ్లపై వలస కూలీలు పడుతున్న బాధలు చెప్పలేనివని ఆవేదన వ్యక్తం చేశారు.
వలసకూలీలకు మాజీమంత్రి సోమిరెడ్డి సాయం - migrant workers news in vijayawada
బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు కాలినడకన బయలుదేరిన 120 మందికి పైగా వలసకూలీలకు... విజయవాడలో మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సాయం అందించారు. వలస కార్మికులను ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
![వలసకూలీలకు మాజీమంత్రి సోమిరెడ్డి సాయం former minister somireddy helped migrant workers in vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7296755-144-7296755-1590084771467.jpg)
వలసకూలీలకు మాజీ మంత్రి సోమిరెడ్డి సహాయం