ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Jawahar: జరిమానాలు, డీజిల్ ధరల పెంపుతో డ్రైవర్ల నుంచి రూ.30వేలు వసూలు: జవహర్ - తెదేపా వార్తలు

జరిమానాలు, డీజిల్ ధరల పెంపుతో డ్రైవర్ల నుంచి సీఎం జగన్​... రూ.30వేలు వసూలు చేశారని మాజీ మంత్రి జవహర్(Jawahar) మండిపడ్డారు. ఎన్నికల ముందు డ్రైవర్లందరికీ వాహనమిత్ర అందిస్తానని చెప్పిన జగన్(jagan) ...అధికారంలోకి వచ్చాక ఓనర్లకు మాత్రమే అని మాట తప్పారని ఆరోపించారు.

former minister Jawahar
మాజీ మంత్రి జవహర్

By

Published : Jun 15, 2021, 8:08 PM IST

వాహన మిత్ర పేరుతో హడావుడి చేస్తున్న జగన్ రెడ్డి... డీజిల్ ధరలు, జరిమానాలు పెంపుతో ఆటో డ్రైవర్ల నుంచి రూ.30వేలు వసూలు చేస్తున్నారని మాజీమంత్రి జవహర్(Jawahar) దుయ్యబట్టారు. జరిమానాలకు అదనంగా జే-ట్యాక్స్ వసూల్ చేస్తూ డ్రైవర్ల పాలిట రక్తం పీల్చే జలగలా మారారని మండిపడ్డారు. ఎన్నికల ముందు డ్రైవర్లందరికీ వాహనమిత్ర అందిస్తానని చెప్పిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఓనర్లకు మాత్రమే అని మాట తప్పారని ఆరోపించారు. దాదాపు 15 వేల మంది అర్హులైన లబ్ధిదారులకు పథకాన్ని దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details