సంస్కరణల పేరుతో విద్యావ్యవస్థను జగన్ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని మాజీమంత్రి జవహర్ ధ్వజమెత్తారు. జాతీయ విద్యా విధానం పేరుతో విద్యార్థులకు విద్యను దూరం చేసే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటోందని మండిపడ్డారు. లోకేశ్‌పై పంతంతోనే పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయకుండా కరోనా సమయంలో నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నాడు - నేడు పేరుతో ఉపాధ్యాయులను బలితీసుకున్న ప్రభుత్వం, విద్యార్థులనూ బలిచేసే చర్యలను మానుకోవాలని హితవుపలికారు. ఫ్యాప్టోకు విద్యాశాఖ సంచాలకులు నోటీసులివ్వడాన్ని ఖండించారు. ప్రశ్నించే గొంతులను నొక్కేసే క్రమంలో భాగంగానే ఈ నోటీసులిచ్చారని జవహర్ విమర్శించారు.
జగన్ ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తోంది: జవహర్ - మాజీ మంత్రి జవహర్ తాజా వార్తలు
జాతీయ విద్యా విధానం పేరుతో విద్యార్థులకు విద్యను దూరం చేసే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటోందని మాజీ మంత్రి జవహర్ ధ్వజమెత్తారు. నాడు నేడు పేరుతో ఉపాధ్యాయులను బలితీసుకున్న ప్రభుత్వం, విద్యార్థులనూ బలిచేసే చర్యలను మానుకోవాలని హితవుపలికారు.
మాజీ మంత్రి జవహర్