ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైకోర్టుకు హాజరైన కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ ఇంతియాజ్ - Krishna District Former Collector Intiaz Latest Information

కోర్టు ధిక్కరణ కేసులో కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ ఇంతియాజ్ హైకోర్టుకు హాజరయ్యారు. 'చేయూత' పథకాన్ని వర్తింపచేయాలనే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనే అంశంపై హైకోర్టు విచారణ చేపట్టింది.

Krishna District Former Collector Intiaz
కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ ఇంతియాజ్

By

Published : Jul 20, 2021, 10:07 PM IST

కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ ఇంతియాజ్ కోర్టు ధిక్కరణ కేసులో భాగంగా.. హైకోర్టుకు హాజరయ్యారు. మునుపు విచారణలో కోర్టుకు హాజరుకాకపోవటంతో హైకోర్టు వారెంట్ జారీ చేసింది. అయితే వారెంట్‌ను రీకాల్ చేయాలని ఇంతియాజ్‌ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఈ మేరకు కోర్టు ఇంతియాజ్‌పై జారీ ఆయిన వారెంట్‌ను రీకాల్ చేసింది.

గతంలో 'చేయూత' పథకాన్ని వర్తింపచేయాలని హైకోర్టు ఆదేశించింది. అయినా కలెక్టర్​ అమలుపరచక పోవటంతో.. జిల్లాలోని చందర్లపాడు వాసులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశారు. ఈ మేరకు కోర్టు విచారణ చేపట్టింది.

ఇదీ చదవండీ..Solar Project Tenders: విచారణ ముగిసేవరకు టెండర్లు ఫైనల్ చేయవద్దని డివిజన్ బెంచ్ ఆదేశం

ABOUT THE AUTHOR

...view details