కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా జరుగుతున్న మట్టి తవ్వకాలను ఈనెల 4 వ తేదీ నుంచి నిలిపివేసినట్లు అటవీ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. తవ్వకాలపై ప్రాథమిక విచారణ, గూగుల్ ఇమేజ్ లను పరిశీలించగా ఆ ప్రాంతంలో 2014 నుండి 2018 వరకు దందా జరిగినట్టు గుర్తించామని చెప్పారు.
ఎంత మట్టి తవ్వకం జరిగిందన్నదీ.. మైనింగ్, ఇతర శాఖల సహకారంతో అంచనా వేస్తున్నామన్నారు. పూర్తి స్థాయి విచారణ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల అటవీప్రాంతంలో మట్టి తవ్వి తీసుకువెళుతున్న వాహనాలను పట్టుకోగా... ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.