ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెప్పుల తయారీపై కరోనా పంజా - foot wear industry effected by lock down

పాదరక్షల తయారీ రంగం కరోనా ప్రభావానికి పూర్తిగా కకావికలమైంది. దక్షిణాదిలోనే ప్రథమ స్థానంలో నిలుస్తున్న- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం... గత రెండు నెలలుగా చెప్పుల తయారీ, విక్రయాలు లేకపోవడంతో- గతంలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అమ్మకాలు పూర్తిగా ఆగిపోవటంతో, సిబ్బందికి జీతాలు... దుకాణాల అద్దె చెల్లింపు నిర్వాహకులకు భారంగా మారింది. భారీ రాయితీతో విక్రయాలు జరిపితే తప్ప లాక్‌డౌన్‌కు ముందు తయారైన సరకు అమ్మకాలు జరిగే పరిస్థితి ఉండకపోవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

foot wear industry crisis in lack down at vijayawada
చెప్పుల తయారీపై కరోనా పంజా

By

Published : May 25, 2020, 4:46 PM IST

ఆధునిక జీవన విధానంలో సామాన్యులు.. సంపన్నుల అనే తేడా లేకుండా అందరి జీవితంలో చెప్పులు ఓ భాగం అయ్యాయి. ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే ఈ చెప్పుల తయారీ రంగం లాక్​డౌన్ దెబ్బతో కుదేలయ్యింది. పెళ్లిళ్లు.. ఎండాకాలం... విద్యాలయాల ప్రారంభంతో కళకళలాడే ఈ రంగం ... కరోనా దెబ్బకు కకావికలమయ్యింది.

చెప్పుల తయారీపై లాక్​డౌన్ ప్రభావం

దక్షిణాది రాష్ట్రాల్లోనే చెప్పుల తయారీకి విజయవాడ పేరొందింది. తయారీ సంస్థలు ఏర్పాటు చేసుకున్న ఔట్​లెట్లతో పాటు, రాష్ట్రంలో 15 వేలకు పైగా చెప్పుల దుకాణాలు ఉన్నట్లు అంచనా.

లాక్​డౌన్​తో వీరందరూ ఉపాధి కోల్పోయారు. తయారీ సంస్థలో పని చేసే వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. మళ్లీ తిరిగి వస్తారో లేదో కూడా తెలియదు. ఇప్పటికే తయారు చేసిన ఉత్పత్తులు గోదాముల్లో ఉండిపోవటంతో... గాలి, వెలుతురు లేక దెబ్బతిన్నాయని వ్యాపారులు వాపోయారు.

కొన్ని సంస్థలు లాక్​డౌన్​లోనూ సిబ్బందికి జీతాలు చెల్లించాయి. ఆర్థిక మూలాలు దెబ్బ తినటంతో ప్రభుత్వాలు ఆదుకోవాలని వ్యాపారులు వేడుకుంటున్నారు. అద్దెల వసూలలో ఒత్తిడి లేకుండా మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతున్నారు. బ్యాంకు వడ్డీ రేట్లు సైతం తగ్గిస్తే తప్ప తిరిగి కోలుకోలేమని స్పష్టం చేశారు.

ఫుట్​వేర్ తయారీ పరిశ్రమపై ఆధారపడిన అనేక మంది చిరు వ్యాపారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. విజయవాడ హనుమాన్​పేట నుంచే పాదరక్షల ఎగుమతులు జరుగుతాయి. అదే ప్రాంతంలో పదుల సంఖ్యలో దుకాణాలు ఉన్నాయి. అన్ని వర్గాల వారికి కావాల్సిన చెప్పులు దొరికే ఈ ప్రాంతం లాక్​డౌన్​తో బోసిపోయింది. దుకాణాలు దుమ్ము పట్టాయి. దుకాణాల నుంచి ఇతర ప్రాంతాలకు సరకు తరలించే పనిలో ఉండే, హమాలీలు,మినీ రిక్షాలు, ఆటోలు వ్యాను డ్రైవర్లు, ఉపాధిలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ కష్టాల నుంచి బయటపడేందుకు దుకాణాలు తెరిచేందుకు అవకాశం ఇవ్వాలని వ్యాపారులు కోరుతున్నారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దుకాణాలు తెరిచేందుకు షరతులతో కూడిన అనుమతులతో పాటు, ఆర్థిక భరోసా ఇస్తే తప్ప కోలుకోవటం కష్టమని తయారీదారులు, వ్యాపారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:వేడుకల తీరును మార్చిన కరోనా!

ABOUT THE AUTHOR

...view details