కృష్ణా జిల్లా విజయవాడ పాతబస్తీలో పేదలకు ఆహార వితరణ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పేదల కోసం ప్రభుత్వం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన ప్రజలకు సి ఛానల్ ఎండీ రమేష్ బాబు అన్నదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. దాతలు ముందుకొచ్చి పేదల ఆకలి తీర్చడంలో తమవంతు సాయం అందిస్తున్నారని తెలిపారు.
ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహారం పంపిణీ - విజయవాడలో లాక్డౌన్
కరోనా వ్యాప్తితో దేశమంతా లాక్డౌన్ అమల్లో ఉంది. అనేక మంది పేద ప్రజలు ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో దాతలు ముందుకు వచ్చి తమ వంతు సాయం అందిస్తున్నారు.

food distribution