కృష్ణా జిల్లా మైలవరం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో.. స్థానిక సూరిబాబు పేట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. గుడివాడ పట్టణంలో స్వచ్ఛంద సంస్థలు పోలీసులకు మాస్కులు, మజ్జిగ ప్యాకెట్లు భోజన ప్యాకేట్లు , శానిటైజర్ల్ పంపిణీ చేశారు. కరోనా లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో నగరంలోని నిరాశ్రయులందరినీ మున్సిపల్ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. సుమారు 500 మందికి మూడు పాఠశాలల్లో వసతి సౌకర్యాలు కల్పించారు.
కృష్ణా జిల్లాలో అన్నార్తులకు ఆపన్న హస్తం - shoutdown AP due to corona virus taja news
లాక్డౌన్ కారణంగా తిండిదొరక్క అన్నార్తులు ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఆకలి తీర్చేందుకు కృష్ణా జిల్లా మైలవరంలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. మరోపక్క పోలీసులు తమకు తోచినంత సాయం చేస్తున్నారు.
కృష్ణాజిల్లాలో అన్నార్తులకు అన్నదానం